calender_icon.png 20 April, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజ్వల్‌పై లుకౌట్ నోటీసు

03-05-2024 12:33:19 AM

ప్రజ్వల్ స్వయంగా రాకుంటే అరెస్టు తప్పదు

కర్ణాటక హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర హెచ్చరిక

ప్రజ్వల్ మాజీ డ్రైవర్ మాయం

బెంగళూరు, మే 2: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గురువారం లుకౌట్ నోటీస్ జారీచేసింది. వెంటనే సిట్ ముందు హాజరుకావాలన్న ఆదేశాలను ఆయన తిరస్కరించటంతో లుకౌట్ నోటీస్ జారీచేసింది. అంతకుముందు విచారణకు హాజరు కావాలని ప్రజ్వల్‌ను సిట్ ఆదేశించింది. అయితే, తాను బెంగళూరులో లేనందున విచారణకు హాజరయ్యేందుకు 7 రోజుల గడువు కావాలని తన న్యాయవాదుల ద్వారా ప్రజ్వల్ కోరాడు.

అందుకు తిరస్కరించిన సిట్.. లుకౌట్ నోటీస్ జారీచేసింది. మరోవైపు ప్రజ్వల్ వెంటనే విచారణకు హాజరుకాకుంటే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నదని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపా రు. కాగా, ఈ కుంభకోణంలో కీలకంగా మారిన ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కనిపించకుండా పోయాడు. తమ ముందు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీచేయటంతో ఆయన ఉన్నట్టుండి అదృ శ్యమయ్యాడు. ఇదిలా ఉండగా, ప్రజ్వల్ విదేశాలకు వెళ్లేందుకు రాజకీయ పరమైన అనుమతి కోరలేదని విదేశాం గశాఖ ఒక ప్రజటనలో తెలిపింది.