calender_icon.png 20 January, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి దర్శకుడి కోసం చూస్తుంటా..

12-08-2024 12:00:00 AM

విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి కనబరిచే ఈ తరం హీరోయిన్లలో మాళవికా మోహనన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ నెల 15న విడుదల కానున్న ‘తంగలాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌లో ఇంకా ఖాతా ఓపెన్ చేయని ఈ కేరళ కుట్టి.. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజాసాబ్’లో నటిస్తోంది. టాలీవుడ్‌లో తన ఎంట్రీ గురించి ఇటీవల మీడియా ప్రస్తావించగా, పలు ఆసక్తికర విషయాలను తెలిపిందీ ముద్దుగుమ్మ.

“తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడెంతో పెద్దది. ప్రస్తుతం ఇది మరో స్థాయిలో ఉందని మన అందరికీ తెలుసు. నాకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా రోజులుగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు నేను చాలా రోజు లుగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. అయితే, మంచి ఆఫర్‌తో టాలీవుడ్‌లోకి రావాలన్న ఆలోచనతో ఉండేదాన్ని. ఒక నటిగా నన్ను నేను నిరూపించుకునే సినిమాలు చేయాలను కోవడమే ఇందుకు కారణం.

నాలోని నటిని వెలికితీసే దర్శకుడి కోసం ఎప్పుడూ ఎదురుచూ స్తుంటా. ఇప్పటివరకు నాలో నాకు కనబడని నటి గురించి తెలుసుకోగలిగేలా చేసే సినిమాలకు ప్రాధాన్యమిస్తా. దర్శకుడు మారుతి సర్ కూడా స్త్రీ పాత్రలను బాగా రాస్తారు. ప్రభాస్ సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ‘తంగలాన్’కు పూర్తి భిన్నమైన పాత్ర” అని తెలిపింది.