calender_icon.png 26 October, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిను చూసి నిలిచే చూపులే..

26-10-2024 12:00:00 AM

శ్రీమురళి హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’. ప్రశాంత్ నీల్ అందించిన కథతో దర్శకుడు డాక్టర్ సూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో రుక్ష్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్‌కుమార్, గరుడ రామ్, తదిత రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్-గా ‘పరిచయమేలే..’ అనే పాటను విడుదల చేశారు. శ్రీమురళి, రుక్మిణి వసంత్‌ల ప్రేమకథను, రెండు విభిన్న వ్యక్తిత్వాలున్న పాత్రల నేపథ్యా న్ని, వారి మధ్య కెమిస్ట్రీని అందంగా ఆవిష్కరించిందీ గీతం.

బి అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు, రాంబాబు గోసాల లిరిక్స్, రితేశ్ జి రావు గాత్రంలో ‘ప్రతి ఉదయం వెతికే కన్నులే.. నిను చూసి నిలిచే చూపులే.. పరిచయమేలే.. పరిచయమేలే.. నిజ ముగ మారె కలలే...’ అంటూ హృద్యంగా సాగుతోందీ పాట.