* కోరిన కోర్కెలు తీర్చే వరాల తల్లి
* ఈ నెల 29 నుంచి పెబ్బేరులో చౌడేశ్వరి దేవి ఉత్సవాలు
పెబ్బేరు, జనవరి 28: ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక చౌడేశ్వరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. అన్ని వర్గాల ప్రజల సంస్కతి సంప్రదా యాలకు శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ప్రతీకగా నిలిస్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలు అందుకుం టున్న అమ్మవారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వెలసిన చౌడేశ్వరి దేవి. సరికొత్త రాజగోపుర నిర్మాణానికి అశేష భక్తజన సందోహం శ్రీకారం చుట్టారు. దాత ల సహాయ సహకారాలతో అమ్మవారి ఆల యాన్ని వైభవంగా నిర్మించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు కషి చేస్తున్నారు.
చౌడేశ్వరి అమ్మవారి దేవి చరిత్ర....
శివుని వరంతో సత్ రాత్రి అనే అడవిలో చౌడేశ్వరి దేవి జన్మించి కొంతకాలం పాటు ఉండి కర్నూలు జిల్లా నందవరం వెళ్లిందని పూర్వీకులు చెప్తుంటారు. కొంతకాలం తర్వాత గుడిబండ రాచాలలో కొలువైందని పూర్వీకుల ప్రచారంలో ఉంది. కాలక్రమేనా అక్కడ ఉన్న ఆలయంలో అమ్మవారికి పూజ లు చేయకుండా ఉండటంతో శిథిలావస్థ స్థితికి చేరుకుంది.
కొంత కాలానికి పెబ్బేరుకు చెందిన యాదవులు గొర్రెల మేపుల కోసం అక్కడికి వెళ్లేవారు. ఒకరోజు యాదవులకు రాత్రి సమయంలో చిన్న బాలిక రూపంలో వచ్చి నేను బండాల రాతిలో పుట్టిన బంగా రు చౌడమ్మను నన్ను ఇక్కడ ఎవరూ పూజిం చడం లేదని నన్ను మీ వెంట తీసుకెళ్లండని యాదవులకు తెలిపింది.
నన్ను మీ వెంట తీసుకువెళ్లండి మీ గ్రామంలో నేను కొలువు తీరుతానని కలలో చెప్పి మాయమైంది . విషయాన్ని గ్రామంలోని యాదవుల వంశంలోని పెద్దలకు వివరించారు. పెద్దల సహాయంతో అమ్మవారిని పల్లకి సేవలో తీసుకు వస్తున్న క్రమంలో అక్కడి గ్రామ స్తులు గమనించి వెనకాల్లో తరలివచ్చారు.
అమ్మవారిని తీసుకు వస్తున్న తరుణంలో ఉరకలు వేస్తున్న ఊక చెట్టు (బుగ్గ వాగు)వాగు దాటే క్రమంలో చౌడేశ్వరి దేవి మహిమతో పెబ్బేరు యాదవులు వాగు దాటి పెబ్బేరుకు చేరుకున్నారు. వాగులో ఉదతంగా ప్రవహిస్తూ నీళ్లను చూసి ఆ గ్రామ ప్రజలు వెనుదిరిగి పోయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
అలా యాదవులు చౌడే శ్వరి దేవిని తీసుకువచ్చి గ్రామంల్లోని వేణు గోపాల స్వామి ఆలయం సమీపంలో గుడి నిర్మాణం చేసి ప్రతిష్టించారు. అమ్మ వారికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పూజలు నిర్వహించేవారు. కాలక్రమేనా యాదవుల అందరు కలిసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గత 16 సంవ త్సరాలుగా ఉత్సవా లు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఉత్సవ కార్యక్రమాలు....
నాలుగు రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 29న రాత్రి 7 గంటలకు వేణుగోపాల స్వామి విగ్రహాన్ని పల్లకి సేవలో ఊరేగింపు చేస్తారు. 30న శ్రీ చౌడేశ్వరి దేవిని పల్లకి సేవలో తీసుకుపోయి మహబూపాల్ సముద్రంలో గంగ స్నానం చేయించిన అనంతరం అదేరో జు రాత్రి 11 గంటలకు నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అమ్మవారిని పల్లకి సేవ, జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఆలయంలో ప్రతిష్టి స్తారు.
31 నుంచి పిబ్రవరి 1వరకు శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఉత్సవాలకు భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చు కుంటారు.