calender_icon.png 30 October, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ముగ్గురి వైపే గుజరాత్ చూపు!

30-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్పును ముద్దాడిన గుజరాత్ టైటాన్స్ చివరి సీజన్‌లో పేలవంగా ఆడి లీగ్ దశకే పరిమితం అయింది. తొలి రెండు సీజన్లలో జట్టును ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ పాండ్యాను చివరి సీజన్లో వదులుకున్న గుజరాత్.. తగిన మూల్యం చెల్లించుకుందనే చెప్పాలి. కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడిన టైటాన్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఈ సారి మెగా వేలం కావడంతో జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్‌లను గుజరాత్ ప్రాంచైజీ రిటైన్ చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

అంతే కాకుండా అన్‌క్యాప్‌డ్ హిట్టర్లయిన రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్‌లను కూడా అలాగే అట్టి పెట్టుకోవాలని జట్టు చూస్తున్నట్లు తెలుస్తోంది. రేపటితో ప్రాంచైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సిన నేపథ్యంలో గుజరాత్ ఎవరిని అట్టిపెట్టుకుంటుందో వేచి చూడాలి.