calender_icon.png 24 November, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల తల్లిని కటాక్షించరూ

06-11-2024 12:05:52 AM

  1. నానమ్మ తాళి తాకట్టు పెట్టి నీట్ శిక్షణ తీసుకున్న గౌతమి
  2. మంచి ర్యాంకుతో సర్కారు వైద్యకళాశాలలో సీటు
  3. ఖర్చులకు డబ్బులు లేని నిస్సహాయ స్థితి

సూర్యాపేట, నవంబర్ 5(విజయక్రాంతి) / తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి మూడేళ్ల వయస్సులోనే అమ్మానాన్నలు చనిపోయారు. నానమ్మ, తాతయ్యలే పెంచారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం అయినా ఇబ్బందులు పడుతూనే చదివించారు.

అన్నీ బాధలు అనుభవిస్తున్న ఆ బాలికకు సరస్వతి దేవి అండగా నిలిచింది. నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి మెడికల్ సీటు సాధించినా.. లక్ష్మీకటాక్షం లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో 922/1000 మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే నీట్‌లో ఉత్తీర్ణత సాధించి దంత వైద్య విద్యలో సీటు పొందినా మరోసారి నీట్ రా యాలని నిశ్చయించుకుంది.

డబ్బులు లేకపోవడంతో నానమ్మ పుస్తెలతాడు తాకట్టు పెట్టి కోచింగ్‌లో చేర్పించింది. కోచింగ్ తీసుకుంటూనే కూలీ పనులకు వెళ్లేది. ఈసారి నీట్‌లో మంచి ర్యాంక్ పొంది, మంచిర్యాల ప్రభుత్వ వైద్య కాలేజీలో సీటు వచ్చింది. చదువు కోసం ఏటా రూ.1.5 లక్షలు కావాలని తెలియడంతో వృద్ధ దంపతులు వేదన పడుతున్నారు. అమ్మేందుకు ఆస్తులు లేవు, చదివించే స్థోమత లేదం టూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

మనుమరాలి చదువుకు దాతలు సాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఆర్థిక సా యం చేయాలనుకునేవారు అకౌంట్ నంబర్ ౧౯౩౮౧౦౮౦౨౨౨౫౨, కెనరా బ్యాంక్, తుంగతుర్తి బ్రాంచిలో జమచేయాలని కోరుతున్నారు.