calender_icon.png 16 November, 2024 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లూఫా మంచిదే.. కానీ!

16-11-2024 12:00:00 AM

శరీరానికి సబ్బు అప్లయ్ చేసుకొని లూఫాతో రద్దుకొని స్నానం చేస్తుంటారు చాలామంది. అయితే లూఫాతో స్నానం చేయడం మంచిదేనా? అని సందేహాలున్నాయి. లూఫా వాడకంతో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామంది లూఫాలను శుభ్రం చేయకపోవడం వల్ల అందులోని సూక్ష్మక్రిములు..

దద్దుర్లు, చర్మం పొడిబారడం, మొటిమలు రావడం, ఇన్ఫెక్షన్లతో సహా వివిధ చర్మ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు పేర్కొన్నారు. అవి తామర వంటి చర్మ సమస్యలకూ దారీతీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే చర్మం మేనిఛాయ దెబ్బతింటుందట. అందకే లూఫా వాడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

అప్పటికే తడిగా ఉన్న లూఫాను తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్లీ వాటిని తిరిగి యూజ్ చేయడం మూలంగా ఇతర సౌందర్య సమస్యలతోపాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందంటున్నారు. అలాగే.. లూఫాను ఎక్కడైనా దెబ్బతగిలిన చోట లేదా ఓపెన్ కట్ ఉన్న చోట ఉపయోగించినట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

ఏం చేయాలంటే..

* వాడిన లూఫాపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచ్ కలిపిన నీటిలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై చల్లటి నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి.

* గోరువెచ్చటి నీటిలో ఏదైనా అత్యవసర నూనె వేసి ఆ నీటితోనూ లూఫాను శుభ్రపరచచ్చు.

* సింథటిక్ లూఫాలను రెండు నిమిషాల పాటు వేడి చేసినా సరిపోతుంది. అయితే వీటిలో ప్లాస్టిక్/లోహాలతో తయారుచేసిన భాగాలు లేకుండా చూసుకోవాలి.

* ఏ లూఫాలనైనా వారానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రపరిస్తే దానివల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

* సున్నితమైన చర్మం లేదా తెరిచిన గాయాలపై లూఫాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్‌ను తీవ్రతరం చేస్తుంది.