calender_icon.png 25 September, 2024 | 6:01 AM

పెద్దల సభ కోసం ఆరాటం

25-09-2024 01:42:11 AM

ఎమ్మెల్సీ కోసం విద్యాసంస్థల అధిపతుల పోరాటం

ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన ఆశావహులు

కరీంనగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): పెద్దల సభ(శాసనమండలి)లో ప్రవేశం కోసం విద్యాసంస్థల అధినేతలు ఆరాట పడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రులు,  ఉపాధ్యాయుల నియోజకవర్గం లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి.

ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవా రు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశా రు. సెప్టెంబర్ 30న ఎన్‌రోల్‌మెంట్ నోటిఫికేషన్ ఎన్నికల కమిషనర్ జారీ చేయ నుంది. 

మానేరు విద్యాసంస్థల అధిపతి కడారి 

కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థల అధిపతి కడారి అనంతరెడ్డి ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి తన నిర్ణయా న్ని ప్రకటించారు. ట్రస్మా నాయకుడి గా, మానేరు విద్యాసంస్థల అధిపతిగా అనంతరెడ్డి పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇటీవలే ఉపాధ్యాయులతో సమావేశమై తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 

పోటీలో ముస్తాక్ అలీ

లక్ష్ ఫౌండేషన్ ద్వారా విద్యాసంస్థ లు నడుపుతున్న డా క్టర్ ఎండి ముస్తాక్ అ లీ ప్రచారాన్ని ము మ్మరం చేశారు. ఇటీవల కరీంనగర్‌లో జాబ్‌మేళా నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రకటించా రు. విద్యాసంస్థలు నడుపుతూనే హైకో ర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది 50 మందికి ఉచి త విద్యనందిస్తున్నారు. బీఆర్‌ఎస్ టికె ట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా బరిలో ఉండేందుకు సిద్ధమై ప్రచారాన్ని ము మ్మరం చేశారు. 

రేసులో అల్ఫోర్స్ వి నరేందర్‌రెడ్డి 

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ తనకే వస్తుందన్న భరోసాతో ఆయన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. టికెట్ రాకున్నా బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్‌రోల్‌మెంట్ ఫాంల పంపిణీ ముమ్మరం చేశారు. 

బీఆర్‌ఎస్‌పై శేఖర్‌రావు ఆశలు

ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వాల్మీకి విద్యాసంస్థల అధిపతి యాదగిరి శేఖర్‌రావు బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన కూడా ప్రచారం ప్రారంభించారు. ఆయన గత పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ టికెట్ ఆశిస్తూ ప్రచారం ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ట్రస్మా ద్వారా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్‌ఎస్ నేతలకు దగ్గరయ్యారు. 

అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ ప్రచారం 

మెదక్ జిల్లా గజ్వేల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా 19 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికి ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేశారు.