calender_icon.png 27 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పదవుల కోసం పడిగాపులు!

14-09-2024 12:40:34 AM

  1. నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ సీనియర్ నేతల ఎదురుచూపు 
  2. లాబీయింగ్ చేస్తున్న ఆశావహులు 
  3. జోకే వారిని దూరం పెట్టాలంటున్న సీనియర్లు 

ఖమ్మం, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఆశావహులు, సీని యర్ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి తొ మ్మిది నెలలు కావస్తున్నా నేటికీ నామినేటెడ్ పదవుల పంపకం చేయకపోవడం తో జిల్లా కు చెందిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జోకే వారిని అక్కున చేర్చుకొని, పార్టీ కష్టకాలంలో సైతం పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని విస్మరించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తొలి దశలో జిల్లా ను ంచి నలుగురికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చై ర్మన్ పోస్టులు దక్కాయి.

కానీ, ఈ విషయం లో సీనియర్లను విస్మరించారనే విమర్శలున్నాయి. జిల్లాలో 1975 నుంచి పార్టీనే అంటిపెట్టుకుని, ఎంతో నష్టపోయిన చాలా మంది నేతలు పదవులు దక్కక అసంతృప్తి లో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని  నెలలు గడిచినా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఒక కొలిక్కిరాకపోవడంతో సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఒక్కో పోస్టుకు అయిదారుగురు పోటీ

ఒక్కో పోస్టు కోసం అయిదారుగురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానం గా సుడా చైర్మన్ పదవి కోసం పలువురు సీ నియర్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అ నుచరులుగా చెప్పుకొంటూ ఆయన వద్ద లా బీయింగ్ చేస్తున్నారు. ఈ పోస్టు కోసం సా ధు రమేశ్‌రెడ్డి, మిక్కిలినేని నరేందర్, దుర్గాప్రసాద్ తదితరులు ముందువరుసలో ఉన్నారు. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చై ర్మన్ పదవి కోసం కూడా ప్రధాన పోటీ నెలకొన్నది. ప్రస్తుతం దొండపాటి వెంకటేశ్వరరావు తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ఆయన స్ధానంలో సీనియర్ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నా యి. ఈ పోస్టు కోసం మంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఓ నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స మాచారం. వీరు కాకుండా మరో ఇద్దరు కూడా లైన్లో ఉన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కూడా పలువురు ఆశావహులు రంగంలో ఉన్నారు. బీసీలకు కేటాయించిన ఈ మార్కెట్ చైర్మన్ పదవీ కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీనేత, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాము లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

30 ఏళ్లకు పైగా పార్టీనే అంటిపె ట్టుకుని వున్న సీతారాములు తనకే ఈ పద వి ఇవ్వాలని సీఎంను, మంత్రులను కలిసి, మొరపెట్టుకున్నారు. మరో ఇద్దరు నేతలు కూడా దీనికోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. నామినేటెడ్ పదవులు కోసం ఇప్పటి కే పలువురు సీనియర్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రులు తమ చుట్టూ తిరిగే అ నుచరులను కాకుండా పార్టీ కోసం శ్రమిస్తు న్న సీనియర్ నేతలను పరిగణలోకి తీసుకు ని, పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.  

కొత్త వారికి పెద్దపీట

ఈ మధ్యకాలంలో పార్టీలో చేరి, మంత్రులతో అంటకాగుతున్న వారికి పెద్ద పీట వేస్తూ సీనియర్లను విస్మరించడంపట్ల పలువురు నాయకులు బహిరంగంగానే అసహనం వ్యక్తంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారు, పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తున్న వారు నామినేటెడ్ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారా ? అని పడిగాపులు కాస్తున్నారు. పీసీసీ అ ధ్యక్ష పదవిని భర్తీ చేయడంతో  జిల్లాలో కూడా నామినేటెడ్ పదవులను ,పార్టీ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ముగ్గురు మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు.

స్థానిక ఎన్నికల ముందే నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవుల పం దేరం చేపడతారని తెలియడంతో ఎవరికి వారు లాబియింగ్ చేస్తున్నారు. జిల్లాలో స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ పదవి తో పాటు జిల్లా కేంద్ర సహకా ర బ్యాంక్, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ, స్తం భాద్రి ఆలయం, శివాలయంతో పాటు భ ద్రాచలం దేవస్థానం పా లక మండలి చైర్మ్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పదవులు, డై రెక్టర్ పదవులు ఖాళీగా ఉండడంతో ఆశావహులు వాటిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.