calender_icon.png 5 January, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లారెడ్డి కాలేజీలో లొల్లి

03-01-2025 01:50:57 AM

సీఎంఆర్‌లో బాత్రూం వీడియోల రచ్చ

  1. కాలేజీలో రెండో రోజూ విద్యార్థినుల ఆందోళన 
  2. విద్యార్థి సంఘాల రాకతో మరింత ఉద్ధృతం 
  3. బాత్రూం వెంటిలేటర్ మీద వేలి ముద్రలు 
  4. పోలీసుల అదుపులో ఐదుగురు అనుమానితులు 
  5. కేసు నమోదు చేసి విచారిస్తున్నాం: ఏసీపీ 
  6. సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్

మేడ్చల్, జనవరి 2 (విజయక్రాంతి): సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్ట ల్ బాత్రూం వద్ద వీడియోలు తీసిన ఘటనపై రెండోరోజు విద్యార్థుల ఆం దోళన కొనసాగింది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరిం గ్ కళాశాలలో బాలికల వసతి గృహం బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని బుధవారం అర్ధరాత్రి వరకు విద్యార్థిను లు ఆందోళన చేసిన విషయం తెలిసిం దే.

రెండోరోజు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు నిరసనలు కొనసాగాయి. విద్యార్థి సంఘా లు రావడంతో ఆందోళన మరింత ఉద్ధృతమైంది. విద్యార్థి సంఘాలను కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా గోడదూకి లోనికి వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

విద్యార్థినులు తరగతులు బహిష్కరించి అక్కడే బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ సంఘాలు విద్యా ర్థినులకు మద్దతుగా ఆందోళనలో పా ల్గొన్నాయి. వార్డెన్ ప్రీతిరెడ్డిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. 

స్పందించని కాలేజీ యాజమాన్యం

విద్యార్థినులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా కాలేజీ యాజమాన్యం సకాలంలో స్పందించలేదు. యాజమాన్యం మొండి వైఖరిపై విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందినది. మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆందోళన ఉద్ధృతం కావడం తో గురువారం సాయంత్రం చైర్మన్ గోపాల్ కళాశాలకు వచ్చి చర్చలు జరిపారు. అయినా విద్యార్థులు శాంతించలేదు. విద్యార్థినుల భద్ర త విషయంలో యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. బీహార్‌కు చెందిన వంట మనుషులకు బాత్రూం పక్కనే గదులు కేటాయించారు.

ఈ విషయమై పలుమార్లు విద్యార్థినులు.. వార్డెన్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉ న్నాయి. వార్డెన్ ప్రీతిరెడ్డి తమపైనే ఆగ్రహం వ్యక్తంచేశారని విద్యార్థినులు తెలిపారు. ప్రస్తు తం ఆందోళన చేస్తుంటే కాలేజీ సిబ్బంది తమను బెదిరిస్తున్నారని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు.

వెంటిలేటర్ మీద వేలిముద్రలు 

బాలికల బాత్రూంకు ఉన్న వెంటిలేటర్ అద్దాల మీద వేలి ముద్రలు కనిపిస్తున్నాయి. ఈ ముద్రలో చేతిముద్రలేనని విద్యార్థినులు వాది స్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలో చేతిముద్రలా? కాదా? అనేది తేలాల్సి ఉంది. విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కాలేజీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఐ సత్యనారాయణ  ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి కాలేజీకి చేరుకుని పరిశీలించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి వద్ద 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వార్డెన్ ప్రీతిరెడ్డిని కూడా విచారించారు. 

సుమోటోగా స్వీకరించిన మహిళ కమిషన్ 

సీఎంఆర్ బాలికల వసతి గృహ ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజా రమణ హాస్టల్‌కు వచ్చి పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సీఎంఆర్ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీచేశామని ఆమె తెలిపారు. వీడియో రికార్డింగ్ చేసినట్టు తేలితే యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసు నమోదు చేసి విచారిస్తున్నాం  

బాత్రూం వద్ద ఒక వ్యక్తి తచ్చాడుతున్నట్టు విద్యార్థినులు తెలిపారు. దానిపై దరఖాస్తు ఇవ్వమని చెప్పాం. విద్యార్థినుల దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నాం. క్లూస్ టీంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించాం. అందులో రెండు చాన్స్ ప్రింట్ వచ్చాయి. ఐదుగురు మీద అనుమానం ఉందని వి ద్యార్థినులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం.

నేను కూడా అక్కడ పరిశీలించాను. బా త్రూం పక్కనే రెండు గదులను పనిచేసే వారికి ఇచ్చారు. వారు అక్కడి నుంచి తిరిగే అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసి బ్యూరోకు పంపాం. అనుమానితుల వద్ద 11 ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నాము. ఫోన్లను మా సిబ్బంది పరిశీలించారు. అందులో వీడియోలు లేవు. డిలీట్ వీడియోలు క్యాట్‌కు పంపి ట్రేస్ చేస్తాం. 

 ఏసీపీ శ్రీనివాసరెడ్డి