calender_icon.png 17 November, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి బిడ్డ ఉన్నత చదువుకు లోకేశ్ సాయం

05-08-2024 12:37:11 AM

ఐఐటీ చదువుకు ఖర్చు భరిస్తానని మంత్రి హామీ  

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): లక్నో ఐఐటీలో ఉన్నత విద్యనభ్యసించాలనే ఓపేద విద్యార్థి కలను ఏపీ మంత్రి నారా లోకేశ్ నేరవేర్చారు. కోర్సు ఫీజు రూ.4 లక్షలు ఉందని, ఆ ఖర్చు భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని ఎక్స్ వేదికగా విద్యార్థి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ఫీజు విషయం తాను చూసుకుంటానని, చదువుపై దృష్టి పెట్టాలని రీట్వీట్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన విద్యార్థి బసవయ్యకు లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. కోర్సు ఫీజు రూ.4 లక్షలు ఉండటంతో ఖర్చు భరించే స్థితిలో కుటుంబం లేకపోవడంతో బసవయ్యకు ఏంచేయాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. విద్యార్థి తన సమస్యను ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్‌కు వివరించారు. చదువుకోవాలని ఉందని, సాయం చేయాలని కోరారు.