calender_icon.png 28 December, 2024 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు

05-11-2024 01:09:09 AM

ముడాకేసులో 6న విచారణకు హాజరుకావాలని ఆదేశం

బెంగళూరు, నవంబర్ 4: ముడా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీచేశారు. నవంబర్ 6న విచారణకు హాజరుకా వాలని అందులో పేర్కొన్నారు. నోటీసుల విషయమై సీఎం కూడా స్పందించారు.

‘ముడాకు సంబంధించి తనకు లోకాయుక్త నోటీసు అందిందని’ సీఎం తెలిపారు. బుధవారం విచారణకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే.. వ్యవస్థలను ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం యత్నిస్తోందని సిద్ధు ఆరోపించారు. రాజకీయ కుట్రలు, విద్వేషాలకు తన భార్యను సైతం బలి చేశారని సిద్ధరామయ్య బీజేపీ, జేడీయూపై గతంలో మండిపడ్డారు.