న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ, సోరోస్ అంశాలపై ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్-సోరోస్ సంబంధాలపై అంశాన్ని బీజేపీ మరోసారి లేవనెత్తింది. సోరోస్ అంశాన్ని కాంగ్రెస్ పక్కదోవ పట్టిస్తోందని బీజేపీ ఆరోపించింది. రాజ్యసభ ఛైర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని బీజేపీ తెలిపింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ క్షమించరని బీజేపీ పేర్కొంది. రాజ్యసభ ఛైర్మన్ ప్రభుత్వ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇరు పార్టీలు సభ నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్షాల నిరసన మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి సభ్యుల నిరసనకు దిగారు. ఆందోళనలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చించాలంటూ విపక్షాల పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు వరుసగా వాయిదా పడుతున్నాయి.