calender_icon.png 18 January, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి బిల్లులు ప్రవేశపెట్టేందుకు మెజార్టీ ఎంపీలు మద్దుతు

17-12-2024 03:02:33 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మంగళవారం ప్రవేశపెట్టారు. దీంతో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోకసభ ఆమోదించింది. కొన్ని విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల కోరిక మేరకు స్పీకర్ ఓం బిర్లా బిల్లులపై హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. మెజార్టీ ఎంపీలు బిల్లులు ప్రవేశపెట్టేందుకు మద్దతు తెలిపాయి.

జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. బిల్లులు ప్రవేశపెట్టడంపై ఎలక్ట్రానిక్, బ్యాలెట్ విధానంలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. దీంతో రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. సభలో విపక్ష ఎంపీల ఆరోపణలపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి బిల్లు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు.