న్యూఢిల్లీ: సోమవారం ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి. లోక్ సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అదానీ గ్రూపుకు చెందిన లంచం ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయడంతో రాజ్యసభలో సభా కార్యక్రమాలు స్తంభించాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు వి. మురళీధరన్ సోమవారం వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు "డబుల్ గేమ్" ఆడుతున్నాయని ఆరోపించారు. గౌతమ్ అదానీ, మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టారు. విపక్ష సభ్యుల నినాదాలతో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.