calender_icon.png 22 November, 2024 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పరామంలో లోక్ మంథన్.. పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ

22-11-2024 12:38:27 PM

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శిల్పరామం వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లడూతూ.. 2018లో రాంచీలో లోక్ మంథన్ కార్యక్రామంలో పాల్గోన్నానని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్టానికి ఈ ప్రయత్నం గోప్పదన్నారు. లోక్ మంథన్ లో పాల్గోంటున్న ప్రతి ఒక్కరిని రాష్ట్రపతి అభినందించారు. భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందని, దేశ ప్రజల్లో సాంస్కృతిక భావన నెలకోల్పాల్సి ఉందని రాష్ట్రపతి తెలిపారు. , రాష్ట్రలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ సంస్కృతిలో భాగం, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇంధ్రధనుస్సులో సౌందర్యన్ని సూచిస్తుంది. గ్రామ, పట్టణ, నగర ప్రజలు ఎవరైనా మనం మొదట భారత పౌరులం, ఎన్నికల ద్వారా రాష్ట్రీయ ఏక్తా అనేది ప్రస్పుటం అవుతుందని అన్నారు.