26-02-2025 10:13:40 PM
ఎస్సై వెంకట్ రెడ్డి...
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై వెంకట్ రెడ్డి పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... మండల పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా వచ్చే నెల మార్చి 8వ తారీఖున జ్యూడిషనల్ మేజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ నారాయణఖేడ్ కోర్టులో "లోక్ అదాలత్" ఉంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ల మీద, మీ మీద, మీ బంధువుల మీద ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ (కాంప్రమైజ్) చేసుకునేందుకు అవకాశం ఉంది. రాజీ చేసుకునే ఇరు వర్గాలవారు మార్చి 1- 8 వరకు పోలీసు స్టేషన్ (లేదా) కోర్టుకి హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయించబడుతాయి.
రాజి కుదుర్చుకునెందుకు వీలున్న కేసులు:
1. యాక్సిడెంట్ కేసులు
2. కొట్టుకున్న కేసులు
3. చీటింగ్ కేసులు
4. చిట్ఫండ్ కేసులు
5. భూతగాదాలకు సంబంధించిన కేసులు
6. వివాహ బంధానికి సంబంధించిన కేసులు
7. చిన్నచిన్న దొంగతనం కేసులు
8. అక్రమ రవాణా (ఇసుక,మట్టి,కట్టెలు, మద్యం మరియు ఇతరములు)
9. పేకాట కేసులు
ఇవి లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు. దీనికోసం ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని పోలీసు స్టేషన్ (లేదా) కోర్టుకి రావాల్సిందిగా ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.