calender_icon.png 7 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ లో లోక్ అదాలత్ కేంద్రం ప్రారంభం

07-04-2025 05:59:27 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాం సాగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో లోక్ అదాలత్ కేంద్రాన్ని కేంద్రాన్ని లోక్ అదాలత్ నిజాంసాగర్ మండల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ లు ప్రారంభించారు. కేసుల పరిష్కారంలో తగిన సహాయం చేసేందుకు లోక్ అదాలత్ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, నాయకులు మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.