calender_icon.png 26 April, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో లోకో పైలట్లు ధర్నా..

25-04-2025 08:53:39 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో తమ సమస్యల పరిష్కారం కోసం లోకో రన్నింగ్ స్టాప్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంగ్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఎన్ ఎఫ్ ఐ ఆర్ పిలుపు మేరకు బెల్లంపల్లి లాబీ లో లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యలపై ధర్నా చేశారు. బెల్లంపల్లి బ్రాంచ్ రైల్వే బోర్డు యొక్క ప్రవేశ పెట్టిన మల్టి డిసిప్లినరీ  కమిటీ లోకో పైలట్ వర్కింగ్ విషయమై అవలంబిస్తున్న కార్మికవ్యతిరేక విధానాల ప ధర్నాకు దిగారు.

కిలోమీటర్ అలవెన్స్ 25 శాతం పెంచాలనీ, 70 శాతం ఇన్కమ్ టాక్స్ ఎక్సెంప్ట్ చేయాలనీ, అలాగే ఎన్పీఎస్, యుపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోకో పైలట్ నీ ఇంటెన్సివ్ కేటగిరీ కింద చేర్చాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ  ధర్నా లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సెక్రటరీ జి శివ, వర్కింగ్ ఛైర్మెన్ కోడూరు అజయ్, వైస్ చైర్మన్ కంచన్ కుమార్, డివిజనల్ అండ్ జోనల్ యూత్ సభ్యులు, వి శ్రీనివాస్, తుషార్ కుమార్, రవినాష్ కుమార్, సంఘ్ సీనియర్ సభ్యులు తిరుపల్ నాయక్ పాల్గొన్నారు.