calender_icon.png 23 February, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకో పైలట్ల నిరసన దీక్ష

21-02-2025 12:00:00 AM

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : సౌత్ సెంట్రల్ రైల్వే లో పనిచేస్తున్న డ్రైవర్ల, గార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో లోకో పైలట్లు 36 గంటల నిరసన దీక్ష, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

గురువారం ఆల్ ఇండియా రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చంతన్‌కుమార్ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైల్వే శాఖలో అన్ని విభాగాల్లో అమలు పరుస్తున్న రన్నింగ్ అలవెన్స్ 25 శాతాన్ని రన్నింగ్ స్టాప్ కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇన్కమ్ టాక్స్ లో రన్నింగ్ స్టాప్ కు 70 శాతం రన్నింగ్ అలవెన్స్ మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బదిలీలను ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని, రన్నింగ్ స్టాప్ కు వారంతపు సెలవు 46 గంటలకు పెంచాలని, రెండు నైట్ డ్యూటీలు మాత్రమే ఇవ్వాలని, గూడ్స్ డ్రైవర్లకు 8 గంటల పని అమలు చేయాలని,

36 గంటలలోపు డైవర్లను హెడ్ క్వాటర్ లకు రిటర్న్ తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం బెల్లంపల్లి బ్రాం ప్రెసిడెంట్ ఏకే పటేల్, సెక్రెటరీ అజయ్ కుమార్, నాయకులు ఏకే మౌర్య, రవీందర్ రామ్, ప్రియాన్స్ దనవ్ తో పాటు పెద్ద సంఖ్యలో రన్నింగ్ స్టాప్, సిబ్బంది పాల్గొన్నారు.