13-03-2025 12:20:49 AM
ఇబ్బందులు పడుతున్న బాలికలు
నాగల్ గిద్ద, మార్చి 12 : నాగల్ గిద్ద మండలం కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం చేసింది. ప్రభుత్వం లక్షల ఖర్చు చేసి రెండు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం చేసిన ప్రధానోపాధ్యాయులు మాత్రం బాలికలకు ఒకటి మాత్రమే ఉపయోగించుకోవాలని రెండవది తాళం వేసి ప్రధానోపాధ్యాయులు తన దగ్గర పెట్టుకున్నారని తెలిపారు.
పాఠశాలలో వంద మంది బాలికలు ఉన్న పాఠశాలలో మూత్రశాల కు వెళ్లాలంటే క్యూలైన్ ఎండలో నిలబడి గంటల సమయం పడుతుంది . పాఠశాలలో ఉన్న మూత్రశాలలు వినియోగంలో తీసుకువచ్చి అదనపు గదుల మంజూరు చేయాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. లక్షల ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మించిన ప్రధానోపాధ్యాయులు అనుమతించడం లేదు.
విద్యార్థులు మూత్రశాల వద్ద గంటల తరబడి ఎండలో నిలబడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమ చర్యలు తీసుకొని బాలికలకు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుచున్నారు. పై విషయంపై కాంప్లెక్స్ హెచ్‌ఎం శంకర్ కి వివరణ కోరగా ఒక గది మాత్రమే విద్యార్థులకు మూత్రశాల అందుబాటులో ఉంటాయని మిగతా ఒకటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మాత్రమే ఉపయోగిస్తారని వివరణలో తెలిపారు.