calender_icon.png 24 October, 2024 | 7:53 AM

తాళం వేసిన ఇల్లు లూఠీ

24-10-2024 01:27:56 AM

37 తులాల బంగారు నగలు అపహరణ

కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పంచాముఖి హను మాన్ కాలనీలో బుధవారం ఈ ఘట న వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో నివసించే హర్నియోగేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 21న వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

ఇంటి తాళం పగల కొట్టి తలుపులు తెరిచి ఉన్నాయని మం గళవారం రాత్రి పక్కింటివారు యోగేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో బు ధవారం ఉదయం పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఇంటిలోని బీరువాలో ఉన్న 37 తులాల బంగారు ఆభరణా లు, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్  ఘటనా స్థలిని పరిశీలించారు. నేరస్థులను పట్టుకోవడానికి   గాలిస్తున్నారు.