calender_icon.png 25 October, 2024 | 4:00 AM

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

12-09-2024 02:39:50 PM

బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ తిరిగిన స్పందించడం లేదని కాంట్రాక్టర్ ఆవేదన

పాఠశాల భవనం నిర్మించి ఆరునెలలైన బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపణ చేసిన కాంట్రాక్టర్

అప్పు తెచ్చి భవనం నిర్మిస్తే బిల్లు లు ఇవ్వక పోవడంతో వడ్డీలు పెరుగుతున్నాయని అప్పుల పాలు అయ్యా యాని పేర్కొన్న కాంట్రాక్టర్

కామారెడ్డి,(విజయక్రాంతి): అప్పులు చేసి పాఠశాల భవనం నిర్మాణ పనులు చేపడితే బిల్లులు ఇవ్వక వడ్డీలు కట్టలేక అప్పుల పాలయ్యానని ఓ కాంట్రాక్టర్ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు. బిల్లు ఇస్తేనే తాళం తీస్తానని పేర్కొన్నారు. పాఠశాల భవనం నిర్మించి ఆరు నెలలు గడిచిన బిల్లులు ఇవ్వడంలేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగితే పిల్లులు ఇవ్వడం లేదని అప్పులు తెచ్చి పాఠశాల భవనం నిర్మించానని బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ వాపోతున్నారు.

ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు సమాచారం అందించగా తమ వద్దకు పంపాలని కాంట్రాక్టర్ ను కోరారు. ఐదు లక్షల అప్పు తెచ్చి నెలకు పదివేల వడ్డీ కడుతున్నానని కాంట్రాక్టర్ తెలిపారు. అధికారులు చుట్టు తిరిగిన స్పందించకపోవడంతో పాఠశాలకు వచ్చి తాళం  వేసినట్లు కాంట్రాక్టర్ తెలిపారు అధికారులు స్పందించి రావాల్సిన బిల్లులు ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై డిఇఓ రాజును వివరణ కోరగా పూర్తిగా పనులు చేయనందుకే బిల్లులు ఆలస్యం అయ్యాయని తెలిపారు. పూర్తి పనులు చేపడితే వెంటనే బిల్లులు ఇప్పిస్తామని డి ఈ వో కాంట్రాక్ట రూ కు చెప్పడంతో పాఠశాల తాళం తీసి కాంట్రాక్టర్ వెళ్లారు. దీంతో వివాదం సద్దుమణిగింది.