* కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి సమీపంలో, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఇండో ఖతర్ ప్రాజెక్టు(వెంచర్) అభివృద్ధికి కొందరు రైతులు భూములు ఇచ్చారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రైతులకు, వెంచర్ యాజ ఆదివారం గొడవ జరగగా రైతులు సంస్థ కార్యాలయానికి తాళాలు వేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో బాధిత రైతులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై బాధిత రైతులు కొందరు కొణిజర్ల పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.