* పెండింగ్ బిల్లు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ నిరసన
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3: తనకు రావాల్సిన పెండింగ్ బిల్లు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ ఎమ్మారో కార్యాలయ గేటుకు తాళం వేసి, ఉద్యోగులు లోపలికి వెళ్లనీవకుండా అడ్డుకొని, నిరసన తెలిపాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. మండలంలోని పోల్కంపల్లికి చెంబాధిత కాంట్రాక్టర్ దానయ్య తెలిపిన ప్రకారం నాలుగేండ్ల కింద రూ.50 లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహంతో పాటు, శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయ భ భు నిర్మించాడు.
ఆ తర్వాత పలుమార్లు అధికారులను బిల్లు ఇవ్వాలని అడిగినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు బిల్లులు ఇవ్వకపోవడంతో తనకు అప్పులు ఇచ్చినవారు తమ ఇంటివద్దకు వచ్చి నానా రభస చేశారు. ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయగా ఆత్మహత్య ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు.
అప్పులు తీర్చలేక తనకున్న భూమిని, ప్లాట్‌ను అమ్మినా ఇంకా అప్పులు తీరలేవని చెప్పాడు. చివరకు చేసేదేమీ లేక సోమవారం కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి వచ్చి వారు దానయ్యను సముదాయించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారించుకోవాలని సూచించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.