calender_icon.png 12 March, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ వర్స్క్ కార్యాలయానికి తాళం

12-03-2025 12:41:04 AM

కూకట్ పల్లి మార్చి 11(విజయక్రాంతి): మూసాపేట డివిజన్ వాటర్ వరక్స్ కార్యాలయం గేటుకు మూసాపేట డివిజన్ కార్పొరేటర్ మహేందర్ మంగళవారం తాళం వేశారు. బస్తీ వాసులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయించవద్దని తాళం వేసినట్లు ఆయన పేర్కొన్నారు. సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ మూసాపేట డివిజన్ లో ఉన్న బస్తీ వాసుల నీటి ఎద్దడి తీరేంతవరకు నీటిని ట్యాంకర్ల ద్వారా విక్రయించవద్దని ఆయన కోరారు.

వేసవికాలం ఆరంభంలోని నీటిని విక్రయిస్తే బస్తీ, కాలనీలలో మరింత నీటి సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు పడతారని అన్నారు. నీటి సమస్యను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కమ్యూనిటీలకు, కాలనీలకు అమ్ముకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మూసాపేట డివిజన్ లో మంచినీటి సమస్యను పరిష్కరించేంత వరకు నీటిని విక్రయించేదని కోరారు. బస్తీలలో నివసిస్తున్న ప్రజలకు నీటి సమస్య ఎందుకు వస్తుంది మేనేజర్ ప్రకాశం నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర స్వామి, రవి గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.