calender_icon.png 27 October, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షారుక్‌కు ‘లోకర్నో’ అవార్డు

03-07-2024 12:05:00 AM

స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను అభిమానులు బాలీవుడ్ బాద్‌షా అని పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారాయన. నిరుడు ఆయన నటించిన ‘జవాన్’, ‘పఠాన్’, ‘డుంకీ’ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసిన షారుఖ్‌కు తాజాగా ఓ అరుదైన ఘనత దక్కింది. ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత ఫెస్టివల్ నిర్వాహకులు తమ అధికారిక సైట్ ద్వారా వెల్లడించారు.

సినీ ఇండస్ట్రీ ద్వారా షారుక్ అందించిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించను న్నామని పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును అందుకున్నవారిలో సాంయ్ మిం గ్ లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానీ టో, ఫ్రాన్సిస్కో రోసీ, హ్యారీ బెలాఫోంటే, జేన్ బిర్కి న్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఇదే ఏడాది ఆగస్టు 10వ తేదీన నిర్వహించనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాజా అవార్డును షారుక్ అందుకోనున్నారు. ఇదే వేదికపై సంజ య్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవ దాస్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.