22-03-2025 02:08:59 AM
ఎల్లారెడ్డి మార్చ్ 21(విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారిపై మురుగు నీరు ప్రవహిస్తుండడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది.రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులలో డ్రైనేజీ లైన్ ద్వంసం కావడంతో శుక్రవారం నాడు కురిసిన వర్షానికి మురుగు నీరు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి దుర్బధంగా రోడ్లు మారడంతో స్థానికులు పట్టణ పారిశుద్ధ్య పట్ల అసహనం వ్యక్తం చేశారు.వర్షపు నీటితో మురుగు నీరు కలిసి విచ్చలవిడిగా ప్రవహించడం వలన దుర్వాసనకు రోడ్లపై వెళ్ళే వాహనదారులు, పాదాచారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వచ్చింది. స్వల్ప వర్షానికి రోడ్లన్ని చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయని వాపోతున్నారు. అధికారులు డ్రైనేజీ వ్యవస్థను పునరుధించాలని స్థానికులు కోరుతున్నారు.