06-02-2025 02:39:06 PM
గుమ్మడిదలలో ర్యాలీ, ధర్నా
గాందీ, అంబేద్కర్ విగ్రహాలను వినతి పత్రం
మద్దతు తెలిపిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి
బీజేపీ నేతల అరెస్టు
నల్లవల్లి, గుమ్మడిదలలో సెల్ టవర్ ఎక్కిన గ్రామస్తులు
పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. గురువారం ఉదయం మండల కేంద్రం గుమ్మడిదలలో ప్రజలు ధర్నా నిర్వహించారు. అనంతరం అఖిలపక్షం నాయకులతో కలిసి తాసిల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆందోళన కార్యక్రమాలకు నరసాపురం ఎమ్మెల్యే సునీత రెడ్డి మద్దతు తెలిపారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు అఖిలపక్షం నాయకులతో కలిసి సునీత రెడ్డి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులను పలువురు స్థానికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారిపై నల్లవల్లి సర్కిల్లో భారీగా పోలీసులు మొహరించారు. గుమ్మడిదల టౌన్ లో జాతీయ రహదారిపై పోలీసులు బృందాలు మోహరించాయి. డంప్యాడ్ ఏర్పాటు వ్యతిరేకంగా నల్లవల్లిలో సెల్ టవర్ కి గ్రామస్తులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. గుమ్మడిదలలో కూడా సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేసిన స్థానికులు అనంతరం కిందికి దిగారు.