ఎమ్మెల్సీ దండే విఠల్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vittal) అన్నారు. కౌటాల మండలంలోని ముత్తన్ పేట్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబివృద్ధికి ఆకర్షితులై మాజీ ఎంపీటీసీ రవి దంపతులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దండే విఠల్ మాట్లాడుతూ... పేదప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జారీ చేస్తుందన్నారు. ముత్యంపేట్ లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌటాల మాజీ ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, చింతలమేపల్లి మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య, టిపిసిసి సభ్యులు అర్షాద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవార్ధన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.