calender_icon.png 9 January, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో స్థానిక సందడి

03-01-2025 01:21:40 AM

* -హుస్నాబాద్‌పై  మంత్రి పొన్నం ఫోకస్

కరీంనగర్, జనవరి 2 (విజయక్రాంతి): గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి అప్పుడే మొదలయింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చేందుకు సిద్ధం కావడంతో ఆశావహులు ఇప్పటి నుండేతమ ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇటీవల కరీంనగర్‌లో పర్యటిం చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నిక లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తల స మావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వ డంతో అప్పుడే పల్లెల్లో స్థానిక సందడి మొ దలయింది.

బీఆర్‌ఎస్ మాత్రం ఇంకా త మ కార్యాచరణ ప్రకటించకపోవడంతో కేంద్ర, రాష్ర్ట అధికార పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నా యకులు అప్పుడే పర్యటనలు పర్యటించారు.

కలిసికట్టుగా పనిచేయాలి: పొన్నం 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేత లంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం కరీం నగర్ జిల్లా చిగురుమామిడి మండలం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మహాలక్ష్మి గార్డెన్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లా డు తూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు నిత్యం ప్రజల్లో ఉండాలని అన్నారు. ఇప్ప టికే ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపా యల రుణమాఫీ చేసిందని, రైతు భరోసా సంక్రాంతికి ప్రారంభమవుతుందని తెలిపా రు.

- ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశా మని, అన్ని గురుకుల పాఠశాలల్లో డైట్ చార్జీలు పెంచామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డు లు వస్తున్నాయని తెలుపుతూ ప్రభుత్వ పథ కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత అవగాహ న కల్పించాలని పిలుపునిచ్చారు.

 చిగురు మామిడి మండలంలోని 17 గ్రామాల కార్య కర్తలు, అధ్యక్షులు గ్రామాల్లో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. సమా వేశంలో చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతితోపాటు గ్రామస్థా యి అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.