- పట్టుకోసం ఆశావహుల ప్రయత్నాలు
- స్థానిక సమరానికి సై అంటున్న యువత
- రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠ
వనపర్తి, డిసెంబర్ 12 (విజయక్రాం తి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోం ది. ఇటీవలే సమగ్ర సర్వే సైతం పూర్తవగా వివరాలు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తికాగా పల్లెల్లో పంచాయతీ పోరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొద లై ఏడాది కావొస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోసం అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో హడావిడి మొదలు కాగా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కచ్చితంగా జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే నమ్మకంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికాబద్ధంగా ఆధిపత్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల వారీగా ఓటరు తుది జాబితాను విడుదల చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తిం చారు. కాగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ము ద్రించేందుకు ప్రింటింగ్ ప్రెస్‌ల ఎంపిక సైతం ప్రారంభమవుతున్న ట్టు సమాచారం. గతంలో బ్యాలెట్ పేపర్లు ముద్రించిన అనుభవం ఉన్న అర్హులైన ప్రింటింగ్ ప్రెస్‌ల నుం చి దరఖాస్తులు స్వీకరించినట్టు తెలుస్తున్నది.
స్థానిక సమరానికి సై అంటున్న యువ నాయకులు..
సాధారణంగా రాజకీయాలపై యువత ఎక్కువ ఆసక్తి కనబర్చదు. కానీ పెరుగుతున్న సాంకేతికత వల్ల యువ ఓటర్లు సైతం పాలిటిక్స్‌లో సత్తా చాటేందుకు ముందుకొస్తు న్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం యువత స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో యువ ఓటర్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తామూ పంచాయతీ పోరులో నిలిచామని చెప్పకనే చెబుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జనవరిలో ఎన్నికల నోటిఫికేష్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
జిల్లా వివరాలు ఇలా..
జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2,366 వార్డులకు గానూ ఎన్నికల కోసం 2,366 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. 200 లోపల ఓటర్లున్న వారి కోసం 1,700 పోలింగ్ కేంద్రాలు.. 201 మధ్య ఓటర్లు ఉన్న కేంద్రాలు 652, 401పైన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 14గా గుర్తించారు. ఈ నెల 10న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల అంశంపై జిల్లాస్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమావేశం కూడా నిర్వహించారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమ గ్రామాలకు ఏ రిజర్వేషన్ అమలవుతుందో అన్న ఉత్కంఠ నాయకు ల్లో నెలకొన్నది. కాగా.. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
శుభకార్యాలకు ప్రజలు పిలవ గానే అభ్యర్థులు ప్రత్యక్షం అవుతున్నారు. ఎవరైనా ప్రమాదాలకు గురైతే ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఓటు కీలకం కాబట్టి నాయకులు ఎవరినీ తీసివేయకుండా అందరి సమస్యలు తెలుసుకుంటూ తమకు ఉన్నదానిలో కొంత మేర సహాయం చేస్తున్నారు.