calender_icon.png 17 November, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికమే లక్ష్యంగా..

17-11-2024 12:45:36 AM

  1. జిల్లాల పర్యటనకు పీసీసీ చీఫ్ శ్రీకారం
  2. నాయకుల మధ్య విభేదాలకు చెక్!
  3. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ 
  4. ప్రతిపక్షాల కట్టడికి కార్యాచరణ 
  5. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు 
  6. రెండ్రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పర్యటన

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాం తి): రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు దూకుడు పెంచడంపై ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. జిల్లాల్లోని పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరిస్తూనే.. ‘స్థానిక’ ఎన్నికల వరకు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు నడుం బిగించింది.

ఈ క్రమంలోనే పార్టీ కేడర్‌ను యాక్టివ్ చేయడం.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగం గా శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించ గా, రెండు రోజుల వ్యవధిలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో పీసీసీ చీఫ్ పర్యటించనున్నా రు.

ఆ తర్వాత మిగతా జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించనున్నా రు. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండడంతోపాటు మహేశ్‌కుమార్ పీసీసీ బాధ్యతలు చేపట్టి రెం డు నెలలు పూర్తవుతుంది. 

ఈ నేపథ్యంలో పార్టీలో తన మార్క్ కనిపించాలనే ఆలోచన తో జిల్లాల్లో పర్యటనకు ప్లాన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష లు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. 

19న వరంగల్‌లో బహిరంగ సభ..

ఇప్పటి దాకా ఐదారు జిల్లాలకు సంబంధించి గాంధీభవన్‌లోనే సమీక్ష లు నిర్వహించారు. అయితే పార్టీ నాయకులందరూ హైదరాబాద్‌కు వచ్చే కంటే తానే జిల్లాలకు వెళ్తే పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం వస్తుందని పీసీసీ చీఫ్ ఈ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల మంత్రి కొండా సురేఖపై ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విభేదా లు వరంగల్‌కే పరిమితం కాలేదని, మిగ తా జిల్లాల్లోనూ విభేదాలున్నట్లుగా పీసీ సీ గుర్తించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో.. ఉత్సవాల పేరుతో ఈ నెల 19న వరంగల్‌లో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతం కావాలంటే.. ముందుగా ఆ జిల్లాలోని నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించాలి.

అందుకోసమే పీసీసీ చీఫ్ శనివారం వరంగల్ జిల్లాకు వెళ్లి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు జిల్లాకు చెంది న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇక ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

డిసెంబర్ చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి.. జనవరి లో కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘స్థాని క’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు.. ప్రభుత్వం కులగణనను ప్రారం భించి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచడం వల్ల ఆ వర్గాలను పూర్తిగా ఆకట్టుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.