రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజ్యసభసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ 30 బీసీ సంఘా ల నేతలు శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి లాల్ కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినట్టుగా కులగణన చేయకుండానే జూన్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే కులగణన ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం కులాలవారీగా లెక్కలు సేకరించిన తర్వాతే విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 29 నుంచి 50 శాతానికి పెంచుతామని రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచు కోవాలని హితవుపలికారు.
ఎన్నికల వాగ్దానాలలో చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న 13 కార్పొ రేషన్లకు తోడుగా 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రస్తుత 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని పేర్కొ న్నారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు దానకర్ణ చారి, జనార్దన్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, ఆశిష్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.