calender_icon.png 14 February, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

14-02-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః త్వరలో జర గనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్నికల సిబ్బంది ని ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆనంద ఖని,  కొత్తగూడెం లోని ఎడ్యుకేషన ల్ ట్రైనింగ్ సెంటర్ నందు గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజ్ 1 రిట ర్నింగ్ అధికారులు మరియు అసి స్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులందరూ శిక్షణా కార్యక్రమంలో అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించుకొని, సందేహాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమంలో డిఎల్‌పిఓలు సుధీర్‌కుమార్, రమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సైదులు, నాగరాజశేఖర్, మాస్టర్ ట్రైనీలు సాయి కృష్ణ, శ్రీనివాసరావు, చలపతి రాజు, దుర్గ శైలజ, స్వరూప్ కుమార్, కుమార్, ఆనంద్ కుమార్ స్వామి, వరప్రసాద్ పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్ 

చర్ల, ఫిబ్రవరి 1౩ ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ చర్ల మండలం చింతకుంట, మొగళ్లపల్లి ఇసుక రీచ్‌లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇసుక రీచ్‌లలో స్టాక్ రిజిస్టర్‌ను, స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు.

ఇసుక రీచ్‌లో లోడింగ్ చేస్తున్న ట్రాక్టర్, లారీల లోడింగ్ వివరాలను అక్కడ పని చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట చర్ల తాసిల్దార్ ఎం శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పర్ణశాల ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు నాటాలి ః కలెక్టర్

భద్రాచలం, ఫిబ్రవరి 1౩ (విజయ క్రాంతి) ః భద్రాచలం అనుబంధ ఆలయం అయిన  పర్ణశాల ఆలయమును జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం ఔషధ మొక్కలు అయిన తులసి మొక్కలను విరివిగా నాటాలని, అందుకోసం దేవస్థానం వారు సూచించిన ప్రదేశమును పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి, దేవస్థాన ఈఈ రవీందర్, పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు పర్ణశాల ఆలయ ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.