calender_icon.png 30 April, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాకే స్థానిక ఎన్నికలు జరపాలి

30-04-2025 12:00:00 AM

  1. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
  2. ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి: -బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్
  3. బిల్లు అమలయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) : స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగన జాతీయ బిసి సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ తో కలసి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 42 శాతంకు పెంచుతూ ఉత్తర్వులు జరుపాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ఊరు వాడలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

మూడు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతామని ప్రకటించారని, కానీ అందులో బీసీ రిజర్వేషన్లు విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. దాదాపు 12 నెలల క్రితం జరగాల్సిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాకుండా ఎన్నికలకు ఎలా వెళ్ళడం న్యాయం కాదన్నారు. బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం అసెంబ్లీలో చట్టం చేశారని, కానీ దీని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వ జిఓ జారీ కాలేదన్నారు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రానికి పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయి కానీ ఇంతవరకు దాని అతీ గతి లేదన్నారు.

రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉందన్నారు. 73-74 వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 243-డీ6 ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. దీని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారని, కావున జిఓ తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చన్నారు.

జనాభా లెక్కలు ఉన్నయని అసెంబ్లీలో చట్టం చేశారని, అలాగే సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూఓ కేసులో 50 శాతం సీలింగ్ ఎత్తివేసిందన్నారు. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉందన్నారు. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవన్నారు. కావున సుప్రీం కోర్టులో కేసు గెలుస్తుందన్నారు. ఒక వేళ ఎవరైనా కోర్టుకు వెళితే గట్టిగా వాదిస్తే కేసు గెలుస్తుందన్నారు.

కేసు గెలవకపోతే పార్టీ భాధ్యత తోపాలు ప్రజలు, బిసి సంఘాలు చూసుకుంటారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా తాడో పేడో తెలుస్తాం అన్నారు. ఇక విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంపుకు కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి కేంద్రానికి పంపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు.

ఇందుకోసం సీఎం కృషి చేయాలన్నారు. విద్యా, ఉద్యోగాలపై 50 శాతం సీలింగ్ సుప్రీం కోర్టు విధించిందన్నారు. కావున అసెంబ్లీలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిసి సంఘం నాయకులు నీల వెంకటేష్, జ్ఞానేశ్వర్, రామ్మూర్తి గౌడ్, భాగ్యలక్ష్మి, నరేందర్, పృధ్వి గౌడ్, రాజేందర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.