calender_icon.png 22 October, 2024 | 9:17 PM

కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

29-07-2024 12:37:21 AM

ఆర్ కృష్ణయ్య డిమాండ్ 

ముషీరాబాద్, జూలై 28: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన 14 బీసీ సంఘాలు, 22 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని అన్నారు. గతంలో సుప్రీంకోర్టు అనేక కేసుల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు పెంచుకోవచ్చని తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం నాయకుడు జిల్లపెల్లి అంజి, రాష్ట్ర బీఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణుడు, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్, బీసీ విద్యార్ధి సంఘం కన్వీనర్ రాందేవ్, బీసీ విద్యార్థి కన్వీనర్ పృథ్వీగౌడ్, యువజన సంఘం నాయకులు భాస్కర్, దీపిక బిల్లా, జయంతి, మణికంఠ కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.