calender_icon.png 10 March, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు

26-01-2025 12:01:35 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ ఆలీ వెల్లడి

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ సలహదారు మహమ్మద్ షబ్బీర్‌ ఆలీ అన్నారు. శనివారం టెక్రియాల్‌లో నిర్వహించిన కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. పాలకవర్గ సభ్యుల పదవికాలం ముగిసినా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్నవారిని చూసి ప్రజలు ఓటు వేస్తారని  తమ పదవికాలం ముగిసినప్పటికి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలను అందించాలని అప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. పదవీకాలం ముగిసిందని  ప్రజలను పట్టించుకోకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన సూచించారు. మరికొన్ని రోజుల్లో వేసవికాలం వస్తుందని నీటి సమస్య ఎక్కడ ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ప్రత్యేకాధికారుల నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా, వైస్ చైర్మన్ వనిత, కమిషనర్ స్పందన, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.