calender_icon.png 22 December, 2024 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వాలి

22-12-2024 03:20:19 AM

*  రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 21: బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బీసీ కుటుం బానికి రూ.10 లక్షల సబ్సీడీ రుణాలు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న 12 కుల ఫెడరేషన్‌లను కార్పొరేషన్‌లుగా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  పిల్లుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ దాదాపు 30 కులాలకు కార్పొరేషన్‌లు లేవని, వీటికి కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, ప్రతీ కార్పొరేషన్‌కు పాలక మండళ్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్,  నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, పగిల్ల సతీష్, లింగయాదవ్, రాందేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.