calender_icon.png 30 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారుల పేర్ల మీద లోన్లు

18-07-2024 02:27:53 AM

  • రూ.5 కోట్లతో ఉడాయించిన బ్యాంక్ మేనేజర్ 
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నిజామాబాద్, జూలై 17(విజయక్రాంతి): యూనియన్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో బాధితులు ఒక్కరొకరుగా బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు ఖాతాదారుల దగ్గర అప్పులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న బ్యాంక్ మేనేజర్.. అప్పులే కాకుండా భారీ కుంభకోణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ముద్రా లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్ట్‌లు, ఎడ్యుకేషన్ లోన్లు, వివిధ వ్యాపారాల స్థాపనకు రుణా లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 50 మందికి పైగా బ్యాంకు ఖాతాదారుల వద్ద చెక్కులు, ఇతర డాక్యుమెంట్లు తీసుకుని వారి పేర్లపై రుణాలు తీసుకుని వారు ఇచ్చిన చెక్కులతో డబ్బులు డ్రా చేసినట్టుగా తెలుస్తోంది, మొత్తానికి మేనేజర్ అజయ్ ఖాతాదారులను రూ.5 కోట్లకు పైగా మోసగించి నట్టుగా సమాచారం.

నిజామాబాద్‌లోని శివాజీనగర్ యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్.. ఖాతాదారులకు లోన్ ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకొని వారి పేర్ల మీద బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేశాడు. వారిచ్చిన చెక్కులు, ఏటీఎం కార్డులతో డబ్బులు డ్రా చేశాడు. దీనికి తోడు ఖాతాదారుల నుంచి అప్పుల రూపంలో రూ.కోటికి పైగా తీసుకుని ఉడాయించాడు. మేనేజర్ పినపాటి అజయ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూ రు జిల్లా తెనాలిగా తెలుస్తోంది. బాధితులు బ్యాంకు సిబ్బంది సలహా మేరకు నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.