calender_icon.png 28 October, 2024 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల్లో రుణమాఫీ టెన్షన్

16-09-2024 12:11:21 AM

  1. మాఫీ అయినవారికి మళ్లీ పంట రుణం
  2. కానివారిలో ఆందోళన 
  3. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
  4. స్పష్టత ఇవ్వలేకపోతున్న అధికారులు

మేడ్చల్, సెప్టెంబర్ 15: రైతులకు రుణమాఫీ టెన్షన్ పట్టుకుంది. తమ రుణం మాఫీ అవుతుందో లేదోనని ఆందోళన చెం దుతున్నారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు కొందరికి మాఫీ జరిగింది. సాంకేతిక, ఇతర కారణాలతో రుణమాఫీ కాకుం డా మిగిలిన వారు ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు.

నెల రోజులు దాటిపో వడంతో వ్యవసాయ కార్యాలయాల చు ట్టూ తిరుగుతున్నారు. అయితే, అధికారులు మాఫీ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్ప డం లేదు. మాఫీ అయిన రైతులు మళ్లీ పం ట రుణం తీసుకోగా, అర్హత ఉండి కాని వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా రు. మేడ్చల్ జిల్లాలో కేవలం 3,468 మందికే మాఫీ అయింది. 22.66 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఇంకా మాఫీకాని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

పూడూరు సంఘంలో తక్కువగా..

మేడ్చల్ మండలంలోని పూడూరు ఆద ర్శ రైతు సేవా సహకార సంఘం పరిధిలో 1,400 మంది రైతులుండగా, కేవలం 214 మందికి మత్రమే రుణమాఫీ జరిగింది. ఫ్యామిలీ ఫొటో దిగాలని 253 మంది జాబితాను అధికారులు పంపారు. వీరి రుణం మాఫీ అయ్యే అవకాశముంది. మిగతా 933 మంది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయింది. వీరి విషయంలో సొసైటీ అధికారు లు కూడా స్పష్టతనివ్వడం లేదు. దీని పరిధిలో మేడ్చల్ మండలంలోని పూడూరు, సోమారం, రావల్‌కోల్, అక్బర్‌జాపేట్, రాజ్ బొల్లారం, ఘన్‌పూర్, అర్కలగూడ, గోసాయిగూడ, మునీరాబాద్, కిష్టాపూర్, శామీర్ పేట్ మండలంలోని యాడారం, తుర్కపల్లి, మురహరిపల్లి, మాజిద్‌పూర్ గ్రామాలున్నాయి.

డబిల్‌పూర్ సొసైటీ పరిధిలో 660 మంది రైతులకు అర్హత ఉండగా, కేవలం 280 మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. సగానికంటే ఎక్కువ 380 మంది కి ఇంకా మాఫీ కావాల్సి ఉంది. దీని పరిధిలో డబిల్‌పూర్, నూతన్‌కల్, లింగాపురం, శ్రీరంగవరం, బండమాదారం గ్రామాలున్నాయి. ఇక మేడ్చల్ సొసైటీ పరిధిలో 524 మంది రైతులుండగా, 310 మందికి రూ. 1.52 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 214 మందికి రూ.1.26 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.

మళ్లీ ఆడిట్ చేయాలంటున్నారు

పూడూరు ఫాక్స్ పరిధిలో 1,400 మంది రైతులున్నారు. 214 మంది ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమయ్యాయి. మరో 253 మంది ఫ్యామిలీ ఫొటో దిగాలని జాబితా పంపారు. వీరికి కూడా మాఫీ అవుతుంది. ఫాక్స్‌కు మేడ్చల్ ఎస్‌బీఐ ఫండింగ్ చేస్తుంది. బ్యాంకు అధికారులు మళ్లీ ఆడిట్ చేయాలంటున్నారు.

 కిశోర్, పూడూరు ఫాక్స్ సీఈవో 

కొనసాగుతున్న వివరాల సేకరణ

రైతుల వివరాల సేకరణ కొనసాగుతోంది. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ నంబర్ లింక్ కాకపోవడం ఇతర సాంకేతిక కారణాలతో మాఫీకాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయ అధికారులు చేపట్టిన సర్వే కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, వారి వయస్సు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్ద ఫొటో తీయాల్సి ఉంది. సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జాప్యం జరగడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.