calender_icon.png 25 January, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ నూరు శాతం అమలు చేయాలి...

24-01-2025 04:48:10 PM

రైతు ఉద్యమాలకు సంసిద్ధం కావాలి.. ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు

జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.. సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలకు రైతులు సంసిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఏఐకేఎస్ జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాతత్వం చేస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 75% వ్యవసాయ రంగం ఉన్నప్పటికీ బడ్జెట్లో 50% నిధులు కేటాయించడమే దీనికి నిదర్శనం అన్నారు. దేశ సరిహద్దుల్లో రైతు నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా చేయాలని, ప్రభుత్వం చెబుతున్న నూరు శాతం రుణమాఫీ జరగలేదన్నారు. లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఆశలు పెట్టుకున్నారని దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. చనిపోయిన వారికి పట్టేదార్ పాస్ పుస్తకం లేని వారికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నవారికి రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అమలు చేసి రెండు సీజన్లకు సంబంధించిన రైతు భరోసా ఎకరానికి 12000 అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మాట్లాడుతూ... 2019 డిసెంబర్లో రైతులతో చర్చలు చేసిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని వాటితో పాటు రైతాంగ సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో నిరసనగా ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకొని వారిపై భాషా వాయుతో దాడులు చేయటం, ముళ్ళకంచెలతో వారిని అడ్డుకోవడం రైతు ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వ ప్రయత్నాలు హేయమైన చర్య అని అన్నారు.

తక్షణమే జాతీయ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు చేపట్టి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని రైతులకు ఇచ్చిన హామీలను, అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... రైతాంగ సమస్యల పరిష్కారానికి నూతన ఉద్యమాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కమటం సురేష్, కుమారి హనుమంతరావు, రవి, ఉకే నారాయణ, వాడే లక్ష్మి, నారటి రమేష్, కోటి నాగేశ్వరరావు, బానోత్ రంజిత్, సీతారాం రెడ్డి, సుబ్బారెడ్డి తదితర రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.