calender_icon.png 4 March, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి

04-03-2025 08:15:58 PM

లీడ్ బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డికి వినతిపత్రం వినతి..

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు.. 

సంగారెడ్డి (విజయక్రాంతి): అర్హులైన రైతులకు ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతు సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జయరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని లీడ్ బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అర్హులైన రైతుల 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 600 మందికి గ్రామీణ బ్యాంకు పేరు మారడంతో రుణమాఫీ కాలేదు అన్నారు. గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, బసప్ప, సాయిలు తదితరులు ఉన్నారు.