calender_icon.png 12 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ ఓ డ్రామా

19-07-2024 12:36:16 AM

లబ్ధిదారుల సంఖ్య తగ్గించి మోసం

స్థానిక ఎన్నికల కోసమే ఈ స్టంట్లు

ఏం సాధించారని సంబురాలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెడుతూ కొద్దిమందినే లబ్ధిదారులుగా చేయడం దుర్మార్గమని విమర్శిం చారు. రాష్ర్టవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుం టే 11 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయటం అన్యాయమని మండిపడ్డారు.

రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్బీసీ) లెక్కల ప్రకారం రాష్ర్టంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకు పైమాటేనని సంజయ్ తెలిపారు. అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏం సాధిం చారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రబీ, ఖరీఫ్‌లో చెల్లించా ల్సిన రైతుభరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? నూటికి 70 మంది రైతులకు బాధ మిగిల్చేలా నిర్ణయం తీసుకున్నందుకా? అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రా మా తప్ప రైతుల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.

తమకు అందుతున్న సమాచారం ప్రకారం లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 39 లక్షలు ఉన్నారని, మిగిలిన వారికి రుణమాఫీ చేయక పోవడానికి కారణాలేమిటో రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రెండు విడతల్లో కలిపి గత ఏడాది దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు అందజేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ర్టంలో 14 లక్షల కౌలు రైతు కుటుంబాలు, 10 లక్షలకుపైగా రైతు కూలీల కుటుంబాలున్నాయని, వీరితో కలిపి రైతుభరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున చెల్లించాలంటే రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటుందన్నారు.

ఇచ్చిన హామీ ప్రకారం ఆ నిధుల ను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టి అందులో మూడోవంతు నిధులను రుణమాఫీకి మళ్లించి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. ఇప్పటికే రుణ మాఫీ అమలు కాకపోవడంతో అసలు, వడ్డీలు చెల్లించకలేక రాష్ర్టంలోని మెజారిటీ రైతులు డిఫాల్టర్ల జాబితాలో చేరారని, రైతులు డిఫాల్టర్లుగా మారడానికి గత ప్రభు త్వ మూర్ఖపు వైఖరే కారణమన్నారు. కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రైతులు తీసుకున్న అప్పులన్నింటికీ అసలు, వడ్డీతోసహా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉందన్నారు.