వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతు రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే ఇప్పుడు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2018 రుణమాఫీ కింద రూ.20 వేల కోట్లు ప్రకటించి, 2023 ఎన్నికల సంవత్సరంలో రూ.13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. అందులో రూ.1400 కోట్లు వెనక్కి వచ్చినా కనీసం స్పందన లేని ప్రబుద్ధులు ప్రస్తుతం మైకుల ముందుకొచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రుణమాఫీ పథకంలో రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికత మాత్రమేనని చెప్పారు. తమ ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని, కుటుం బ నిర్దారణ కాగానే రుణమాఫీ మిగతా వారికి వర్తింపజేస్తామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమా ఫీ చేస్తుంటే హర్షించాల్సిందిపోయి, తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.