calender_icon.png 24 March, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి

23-03-2025 12:45:33 AM

అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లుగా రూ. 2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులందరికి రుణమాఫీ పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాంకేతిక సమస్యలున్న రైతుల వివ రాలు సేకరించి వారికి కూడా రైతు రుణమా ఫీ చేసినట్లు స్పష్టం చేశారు.

శనివారం అసెంబ్లీలో వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కుటుంబానికి ఒక రేషన్ కార్డు ప్రకారంగా 25 లక్షల కుటుంబాలకు రూ. 20, 611 కోట్లు చెల్లించడంతో పాటు పంట న ష్టానికి పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. రైతులు డబ్బు లు చెల్లిస్తే 2 లక్షలపై ఉన్న రుణం కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారని.

ఆయన మాటలు నమ్మి డబ్బులు చె ల్లించిన రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. అయితే మ్ంర తి తుమ్మల మాత్రం రుణమాఫీ పూర్తయిందని పేర్కొనడాన్ని తప్పుబట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అందుకు నిరసనగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.