calender_icon.png 25 October, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోన్ ఇప్పిస్తామని 3.12 లక్షలు లూటీ

25-10-2024 12:21:14 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): లోన్ ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యాపారి నుంచి రూ.3.12 లక్షలు లూటీ చేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ వ్యాపారి(48)కి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లోన్ కావాలంటే తనను సంప్రదించాలని చెప్పాడు. ఇందుకోసం వ్యాపారం ధ్రువీకరణ పత్రాల ను పంపాలని సూచించాడు. దీంతో వ్యాపారి తన ఆధార్ కార్డు, పాన్‌కార్డు, లేబర్, ట్రేడ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితర పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. పత్రాలను అందుకున్న తర్వాత స్కామర్లు తాము ఐఎన్‌డీఐఎఫ్‌ఐ ఫైనాన్స్ నుంచి రుణాన్ని మంజూరు చేపిస్తున్నట్లు తెలిపారు. మంజూరైన మొత్తం బాధితుడి ఖాతాకు బదిలీ చేస్తామని, ఈఎమ్‌ఐ తదితర వివరాల గురించి వివరించారు. అనంతరం స్కామర్లు జీఎస్టీ, బీమా, డిమాండ్ డ్రాఫ్ట్, డ్యూటీ స్టాంప్ ఇలా వివిధ రకాల ఛార్జీలను చెల్లించాలని చెప్పారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 3.12 లక్షలు చెల్లించాడు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయనని గ్రహించి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.