calender_icon.png 26 April, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు రుణసాయం

26-04-2025 12:00:00 AM

ఆర్థిక స్థోమత లేనివారికి చేయూత

ఎస్‌హెచ్‌ల ద్వారా అందించేందుకు కసరత్తు

ఇళ్ల నిర్మాణం వేగవంతంపై అధికారుల దృష్టి

సంగారెడ్డి, ఏప్రిల్ 25(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మం జూరు చేసిన ఇండ్ల నిర్మాణాలన్నీ ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురు మొదలు పెట్టగా చాలామంది ఆ ర్థిక ఇబ్బందులతో షురూ చేయలేదు. అ లాంటి వారిని గుర్తించి త్వరగా ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్వ యం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు ఆర్థకసాయం అందించేలా యోచిస్తున్నారు. ఈ మేరకు హౌజింగ్, డీఆర్డీఏ అధి కారులు, ఎంపీడీవోలతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు. 

భారంగా ఇంటి నిర్మాణం...

పేదల సొంతింటి కల సాకారం చేయాల నే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒకటి చొప్పున గ్రామాల ను ఎంపిక చేసి అర్హులైన వారికి మంజూరు చేసింది. ఇందులో కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. హౌజింగ్ శాఖ ఇచ్చిన మా ర్కవుట్ ప్రకారం పనులు చేపడుతున్నారు. కొంతమంది బేస్మెంట్ సైతం పూర్తి చేశారు. చాలా వరక మాత్రం నిర్మాణాలకు ముందు కు రావడం లేదు. ఇసుక, సిమెంట్, స్టీల్ ధ రలు భారీగా ఉండడంతో పాటు ఆర్థిక స్థో మత లేకపోవడంతో పనులు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. పాత ఇళ్లను తొలగించి పునాదులు తీసుకుంటే ప్రభుత్వమిచ్చే డబ్బు లు ఆలస్యమైతే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి వారిని గుర్తించి స్వయం సహాయక సంఘాల ద్వా రా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయం మంజూరు చేసినట్లయితే పనులు ముమ్మరమై నిర్మాణాలు త్వరగా పూర్తయ్యే అవకా శం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జమ చేసిన డబ్బులను తిరిగి ఎస్హెచ్జీలకు అం దించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నాలుగు విడతల్లో ఆర్థిక సాయం

ఇందిరమ్మ లబ్దిదారులకు నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో మొదట పు నాదులు పూర్తయితే రూ.లక్ష, పిల్లర్లు వేసిన తర్వాత రూ.1.25 లక్షలు, స్లాబ్ తర్వాత రూ.1.75 లక్షలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష చొప్పున జమ చేయనున్నా రు. ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు ఐకేపీ ద్వారా మరో రూ.లక్ష రుణం అందించనున్నారు. అయితే లబ్దిదారు స్వయం సహాయ క సంఘాల్లో సభ్యులై ఉండడంతో పాటు వారు ఉన్న సంఘం రుణానికి అర్హత కలిగి ఉన్నట్లయితేనే అందజేయనున్నారు.

ఇంకా ఆదేశాలు రాలేదు...జ్యోతి, డీఆర్డీవో, సంగారెడ్డి

ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న లబ్దిదారులను గుర్తించి వారికి ఎస్హెచ్జీల ద్వారా రుణసాయం అందించే విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రభు త్వం నుండి గైడ్లైన్స్ వస్తే పరిశీలిస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.