08-03-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై సీఎం స్టాలిన్ సెటైర్లు
తమిళంలో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించాలని షా కౌంటర్
చెన్నై, మార్చి 7: పీహెచ్‌డీ చేసిన వ్యక్తికి ఎల్‌కేజీ విద్యార్థి ఉపన్యాసం చెప్పినట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వైఖరి ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎగతాళి చేశారు. నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌పీఈ) ద్వారా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలకు తమిళనాడు ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా ఆ భాషను రుద్దేందుకు ప్రయ త్నిస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం హిందీ వలసవాదానికి పాల్పడుతుందని ఆరోపించిన స్టాలిన్ ఈ విధానాన్ని బ్రిటిష్ పాలనతో పోల్చారు. ‘చెట్టు ప్రశాంతంగా ఉండాలనుకున్నా, గాలి ఊరుకోదు. డీఎంకే ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకునేలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెచ్చగొట్టారు. ఆయన తన స్థానాన్ని మరిచిపయి హిందీని అంగీకరించమని మొత్తం రాష్ట్రాన్ని బెదిరించే ధైర్యం చేశారు. దీంతో ఎప్పటికీ గెలవలేని యుద్ధాన్ని మొదలుపెట్టడం ద్వా రా ఆయన దాని పరిణామాలను ఎదుర్కొంటారు. లొంగిపోయే విధంగా తమిళనా డును బ్లాక్‌మెయిల్ చేయలేరు’ అంటూ తన పోస్టులో ఘాటుగా పేర్కొన్నారు.
స్టాలిన్‌కు హోంమంత్రి కౌంటర్
హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్ర బలవంతంగా ఆ భాషను రుద్దుతోందంటూ స్టాలిన్ చేసిన ఆరోపణలపై అమిత్ షా స్పం దించారు. తమిళంలో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.