calender_icon.png 27 December, 2024 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బల్లిపడిన టిఫిన్లు.. చట్నీలో చిట్టెలుకలు’

11-07-2024 01:40:12 AM

  1. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన మార్పు
  2. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చే భరోసా ఇదేనా?
  3. ‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పురుగులన్నం.. నీళ్ల చారు పెడితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు బల్లి పడిన టిఫిన్లు.. చిట్టెలుకలు పడిన చట్నీలు అందిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం ‘ఎక్స్’ ద్వారా మండిపడ్డారు. ‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అన్ని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారని, ఇలాంటి మార్పు కోసమే మార్పు కావాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.

భువనగిరి సాం ఘిక  సంక్షేమ పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థి జీవితం విషాదాంతంగా ముగిసిందని గుర్తుచేశారు. కోమ టిపల్లి హస్టల్‌లో బల్లి పడిన ఉప్మా తిని 20 మంది విద్యార్థులు అస్వస్థులయ్యారన్నారు. తాజాగా సు ల్తాన్‌పూర్ జేఎన్టీ యూ క్యాంటీన్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనమిచ్చిందని, పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవడం ఏమిటని నిప్పులు చెరిగారు. అల్లారు ముద్దుగా పెం చుకునే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తే, ప్రభు త్వం ఇలా కాపాడుకుంటుందా? అని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, వైఫల్యాలను సరిచేసుకోవాలని హితవు పలికారు.

జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం..

ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల ధర్నా కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్‌ను చేయడాన్ని ఖండిస్తు న్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. అలాగే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద  ఓ మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఓ రిపోర్టర్ గల్లా పట్టుకున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ?  అని ప్రశ్నించారు.